సీఎం రేవంత్, నాగార్జునను కలిసిన బెల్లంకొండ ఫ్యామిలీ.. పెళ్లి పనుల్లో బిజీ

  • త్వరలో ఓ ఇంటివాడు కానున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్
  • ఈనెల 29న తిరుమలలో కావ్యారెడ్డితో వివాహం
  • పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన బెల్లంకొండ కుటుంబం
  • నటుడు నాగార్జునను కూడా వివాహానికి ఆహ్వానించిన వైనం
  • ప్రముఖులకు శుభలేఖలు ఇస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్
టాలీవుడ్ యువ కథానాయకుడు, నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ తనయుడు సాయి శ్రీనివాస్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈ క్రమంలో వివాహ పనుల్లో ఆయన కుటుంబం నిమగ్నమైంది. ప్రముఖులను పెళ్లికి ఆహ్వానించే కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, నటుడు అక్కినేని నాగార్జునను సాయి శ్రీనివాస్ తన తండ్రి సురేశ్‌తో కలిసి వ్యక్తిగతంగా వివాహానికి ఆహ్వానించారు.

కావ్యారెడ్డి అనే యువతితో సాయి శ్రీనివాస్‌ వివాహం జరగనున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 29న తిరుమల పుణ్యక్షేత్రంలో వీరి వివాహ వేడుక జరగనుంది. ఇటీవల ఏప్రిల్ 5న వీరి నిశ్చితార్థం హైదరాబాద్‌లో జరిగింది.

వివాహానికి సమయం దగ్గరపడుతుండటంతో బెల్లంకొండ సురేశ్‌ కుటుంబం శుభలేఖల పంపిణీలో బిజీగా ఉంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, నాగార్జునకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్‌కు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవిని కూడా వారు వివాహానికి ఆహ్వానించారు. ప్రస్తుతం ప్రముఖులకు శుభలేఖలు అందిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 

Bellamkonda Sai Srinivas
Revanth Reddy
Nagarjuna
Bellamkonda Suresh
Kavya Reddy
Tollywood wedding
Sai Srinivas wedding
Telugu cinema
Tirumala
Chiranjeevi

More Telugu News